KTR: కేటీఆర్, విజయసాయిరెడ్డి కవితాత్మక ట్వీట్లతో శుభాకాంక్షలు

  • తెలుగు ప్రజలకు నేతల శుభాకాంక్షలు
  • కవితలు రాసుకొచ్చిన కేటీఆర్, విజయసాయిరెడ్డి
  • సంక్రాంతి సందర్భంగా ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్ష
సంక్రాంతి సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వారిద్దరూ తమ ట్వీట్లలో కవితలు రాసుకురావడం విశేషం. 'ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో.. వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో.. మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో.. మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో.. ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది, అందరూ నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' అని కేటీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు.. 'వరుణ దేవుని కరుణతో నదులు, వాగులు పొంగిపొరలగా... పాడి పంటలతో పల్లె సీమలు కొత్త శోభను సంతరించుకోగా... జగనన్న తెచ్చిన నవరత్నాలతో  ఈ సంక్రాంతి సరికొత్త కాంతులతో వర్ణ శోభితం అయింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
KTR
Vijay Sai Reddy
YSRCP
TRS

More Telugu News