Jayalalitha: ఎంజీఆర్ తాత, జయలలిత అవ్వ: తమిళనాడు మంత్రి శ్రీనివాసన్

  • విద్యారంగం అభివృద్ధికి ఇద్దరి కృషి
  • వారి ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి
  • మంత్రి వ్యాఖ్యలపై ఓ వర్గం విమర్శలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ ను తాతయ్యగాను, జయలలితను అవ్వగానూ భావించాలని తమిళనాడు అటవీ శాఖా మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కోరారు. విద్యారంగం, క్రీడారంగాల అభివృద్ధికి వారిద్దరూ పలు పథకాలను ప్రవేశపెట్టారని, వాటి ఫలాలను ఇప్పుడు విద్యార్థులు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. యువజన క్రీడాభివృద్ధి స్కీమ్ లో భాగంగా యువ క్రీడాకారులకు ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలు, దుస్తులను అందించిన ఆయన, మాజీ ముఖ్యమంత్రులను నిరంతరం తలచుకోవాలని సూచించారు. కాగా, ఎంజీఆర్ ను తలైవాగా, జయలలితను అమ్మగా భావించే తమిళనాడులో వారిని అవ్వ, తాతలుగా భావించాలని మంత్రి చెప్పడంపై ఓ వర్గం విమర్శలను గుప్పిస్తోంది.
Jayalalitha
MGR
Tamilnadu

More Telugu News