SS Thaman: పవన్ సినిమాకు మ్యూజిక్ కంపోజింగ్ మొదలైందన్న ఎస్ఎస్ థమన్!

  • 'అల వైకుంఠపురములో..'తో బంపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్
  • థమన్ కు స్పెషల్ ఫ్లవర్ బొకేను పంపిన పవన్
  • భవిష్యత్ అధికార నేత నుంచి వచ్చిందన్న థమన్
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, మెగా ఫ్యాన్స్ కు సూపర్బ్ గుడ్ న్యూస్ చెప్పారు. 'అజ్ఞాతవాసి' తరువాత మరో సినిమాను చేయకుండా పూర్తి స్థాయిలో రాజకీయాలకు పరిమితమైన పవన్ కల్యాణ్, మరో సినిమా చేయనున్నట్టు దాదాపు అధికారికంగా కన్ఫార్మ్ చేశాడు. పవన్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. అయితే, సంక్రాంతి సందర్భంగా థమన్ పెట్టిన ఓ ట్వీట్ దీనిపై పూర్తి క్లారిటీని ఇచ్చేసింది.

ఇటీవలి 'అల వైకుంఠపురములో..'తో బంపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ ను ఇచ్చిన థమన్ కు పవన్ ప్రత్యేక ఫ్లవర్ బొకేను పంపగా, దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన థమన్, ఓ ట్వీట్ పెట్టారు.

"నేనెంతో అభిమానించే వ్యక్తి నుంచి ఈ బోకే వచ్చింది. ఇందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ బహుమతి మన నేత, భవిష్యత్ అధికారనేత  నుంచి వచ్చింది. ఆయనకు నా ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఆయన సినిమాకు కావాల్సిన పాటలను కంపోజ్ చేస్తున్నాను. ఫ్యాన్స్ కు ఇది అతిపెద్ద మూమెంట్" అని అన్నారు.

ఇక థమన్ ట్వీట్ చూసిన పవన్ ఫ్యాన్స్, తమ అభిమాన హీరో కొత్త సినిమా విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు. సినిమా కచ్చితమని, దానికి థమన్ సంగీత దర్శకుడని నిర్ణయించేసుకున్నారు. ఇక ఇప్పటికే వార్తలు వచ్చినట్టుగా దిల్ రాజు బ్యానర్ లో 'పింక్' రీమేక్ గా ఇది ఉంటుందా? లేక మరో చిత్రమా అన్న విషయం తెలియాల్సివుంది.
SS Thaman
Pawan Kalyan
Music
Album
Twitter
New Movie

More Telugu News