బ్యాక్ గ్రౌండ్ లో అగ్నిపర్వతం పేలినా... పెళ్లి మాత్రం ఆగలేదు!
- ఫిలిప్పీన్స్ లో ఘటన
- విస్ఫోటనం చెందిన తాల్ అగ్నిపర్వతం
- అయినా పెళ్లి చేసుకున్న జంట
సరిగ్గా ఉంగరాలు మార్చుకునే సమయానికి ఆకాశం నలుపు రంగు పులుముకుంది. ఏంటని చూస్తే అగ్నిపర్వతం బద్దలవడంతో పైకి ఎగసిన ధూళి ఆకాశాన్నంటింది. దాంతో, అతిథులు పరుగులు తీసేందుకు ప్రయత్నించగా, వధూవరులు వారిని అభ్యర్థించి, పెళ్లి అయ్యేంత వరకు ఆగాలన్నారు. ఓవైపు బ్యాక్ గ్రౌండ్ లో తాల్ అగ్నిపర్వతం నిప్పులు కక్కుతుండగా, హడావుడిగా పెళ్లితంతు ముగించారు. పెళ్లి ముగిసిందన్న మరుక్షణమే నిమిషాల్లో వేదికను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.