Telangana: హెడ్‌ కానిస్టేబుల్‌ను కారుతో ఢీ కొట్టిన యువకులు

  • వనపర్తి జిల్లా మర్రికుంటలో ఘటన
  • వాహనాల తనిఖీ విధుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌
  • కారు ఆపకుండా వేగంగా వెళ్లి ఢీ కొట్టిన వైనం
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
వనపర్తి జిల్లా మర్రికుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్‌ను కొందరు యువకులు కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, ఆయన ఈ రోజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

  మృతుడి పేరు సలీం ఖాన్‌ (57) అని, ఆయన శ్రీరంగాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వివరించారు. నిన్న రాత్రి పలువురు పోలీసులతో కలిసి ఆయన మర్రికుంటలో వాహనాల తనిఖీ విధుల్లో ఉన్న సమయంలో ఓ కారును ఆపుతుండగా, ఆ కారులోని గుర్తు తెలియని యువకులు కారు వేగం పెంచి ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Telangana
Crime News

More Telugu News