TRS: కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేత

  • మేడ్చల్ లో చోటుచేసుకున్న ఘటన
  • మరో వ్యక్తికి బీఫామ్ ఇచ్చిన టీఆర్ఎస్
  • మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన అభ్యర్థి
బీఫామ్ ఇవ్వలేదనే కారణంతో టీఆర్ఎస్ కు చెందిన ఓ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన మేడ్చల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ లోని 14వ వార్డుకు విజయ్ అనే వ్యక్తి నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ పార్టీ తనకు బీఫామ్ ఇస్తుందని ఆయన పూర్తి నమ్మకం పెట్టుకున్నారు.

అయితే, ఆయనకు కాకుండా మరో వ్యక్తికి పార్టీ నాయకత్వం బీఫామ్ ఇచ్చింది. దీంతో, మనస్తాపానికి గురైన ఆయన... స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను అడ్డుకున్నారు. ఈ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
TRS
Suicide Attempt

More Telugu News