Amaravati: మేం మంత్రి బొత్సను కలిశామనడం అవాస్తవం: రాజధాని రైతులు

  • భూములిచ్చిన రైతులను మంత్రి సంప్రదించలేదు 
  • 144 సెక్షన్ ఉంటే ఆర్కే ర్యాలీకి అనుమతి ఎలా ఇచ్చారు 
  • మేము కూడా ర్యాలీ చేస్తాం

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులెవరూ మంత్రి బొత్స సత్యనారాయణను కలవలేదని, కలిసినట్టు వార్తలు సృష్టించారని ఆందోళన చేస్తున్న వారు స్పష్టం చేశారు. నిరసన తెలియజేస్తున్న రైతులు మాట్లాడుతూ 144 సెక్షన్ అమల్లో ఉందంటూ మా ఆందోళనను అణగదొక్కుతున్న పోలీసులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.


రేపు 29 గ్రామాల రైతులు ర్యాలీ నిర్వహిస్తారని, జరిగే పరిణామాలకు డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్కే పాదయాత్ర వారి కార్యకర్తల కోసమేనని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆర్కే తమను కలవాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏ ఒక్కరూ పండగ చేసుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Amaravati
farmers
Botsa Satyanarayana Satyanarayana

More Telugu News