Jagan: సీఎం అయిపోవాలని తండ్రి శవం పక్కన ఉండగానే జగన్ సంతకాలు సేకరించాడు: బుద్ధా వెంకన్న

  • పదవి దక్కకపోయే సరికి ఓదార్పు యాత్ర చేశారు
  • శవాల దగ్గర మొసలి కన్నీరు కార్చారు 
  • అమరావతిని చంపడానికి అనేక కుట్రలు చేశారు
  • పచ్చని పంట పొలాలు తగులబెట్టాడు
స్వార్థానికి మరో పేరు వైఎస్ జగన్ అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. సొంత ప్రయోజనాల కోసమే అమరావతి రాజధాని విషయంలో జగన్ ఇటువంటి తీరు కనబర్చుతున్నారని ఆయన ట్వీట్లు చేశారు.

'ముఖ్యమంత్రి అయిపోవాలని తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాలు సేకరించాడు. పదవి దక్కకపోయే సరికి ఓదార్పు యాత్ర అంటూ శవాల దగ్గర మొసలి కన్నీరు కార్చారు. తండ్రి లేని కొడుకుని అరెస్ట్ చేస్తారా? అంటూ మహిళలను అడ్డుపెట్టుకొని సెంటిమెంట్ రగిల్చాడు' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
 
'అమరావతిని చంపడానికి అనేక కుట్రలు చేశారు. పచ్చని పంట పొలాలు తగులబెట్టాడు, ఇప్పుడేమో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి చలికాగుతున్నాడు జగన్ గారు. స్వార్థానికి ఇంత కన్నా పెద్ద ఉదాహరణ ఉంటుందా విజయసాయి రెడ్డి గారు?' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
Jagan
Amaravati
Andhra Pradesh

More Telugu News