నరసరావుపేటలో అనుమతి లేదంటూ ర్యాలీని ఆపేందుకు పోలీసుల యత్నం.. ప్రతిఘటించిన చంద్రబాబు
- కొనసాగుతున్న సేవ్ అమరావతి ఉద్యమం
- నరసరావుపేట వెళ్లిన చంద్రబాబు
- అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ
కానీ చంద్రబాబు పోలీసుల అభ్యంతరాలను లెక్కచేయకుండా ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతల ర్యాలీలకు ఎలా అనుమతిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే చంద్రబాబు గట్టిగా నిలదీయడంతో పోలీసులు యువకుల బైక్ తాళాలను తిరిగి ఇచ్చేశారు. చంద్రబాబు స్పందిస్తూ, డీజీపీ గౌతమ్ సవాంగ్ చట్టవ్యతిరేక చర్యలను విడనాడాలని స్పష్టం చేశారు.