హింసకు మీరే కారణం.. వామపక్ష పార్టీలపై విరుచుకుపడిన యోగి
- గ్వాలియర్లో సీఏఏకు మద్దతుగా సభ
- వామపక్షాలపై విరుచుకుపడిన యూపీ సీఎం
- ముగింపు దశలో ఉన్న ఉగ్రవాదం మళ్లీ లేస్తోందని ఆవేదన
ఢిల్లీ జేఎన్యూలో పరీక్షలకు అంతరాయం కలిగించేందుకే వారు ఇలాంటి కుట్ర పన్నుతున్నారని అన్నారు. సీఏఏ, జేఎన్యూ ఘటన విషయాల్లో ప్రతిపక్షాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని, ఫలితంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలతో దేశంలో ముగింపు దశలో ఉన్న ఉగ్రవాదం, వేర్పాటువాదం మళ్లీ పురుడుపోసుకుంటున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.