అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మోహరింపు
- అరేబియా సముద్రంలో చైనా, పాక్ సైనిక విన్యాసాలు
- అప్రమత్తమైన భారత్
- క్షుణ్ణంగా గమనిస్తున్న భారత్
చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర అరేబియా సముద్రంలో చైనా కదిలికలు పెరుగుతున్నాయి. దీంతో అటువైపు కన్నేసిన భారత్ నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. తాజాగా, చైనా, పాక్‌లు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో భారత్ ఐఎన్ఎన్ విక్రమాదిత్యను సముద్రంలో వ్యూహాత్మకంగా మోహరించింది.