బ్రేకింగ్... విజయమ్మ, షర్మిల, కొండా దంపతులు కోర్టుకు రావడం లేదు!
- 2012 నాటి కేసులో సమన్లు
- ఇంకా నిందితులకు అందని కోర్టు వారెంట్లు
- హాజరు కాబోవడం లేదన్న సురేఖ
సమన్లు జారీ అయినా, అధికారికంగా వారికి ఇంకా అవి చేరలేదు. ఈ కారణంతో వారెవరూ నేడు కోర్టుకు హాజరు కావడం లేదని సమాచారం. ఈ విషయాన్ని కొండా సురేఖ ఈ ఉదయం తెలిపారు. తమకు ఎటువంటి సమన్లూ రాలేదని, మీడియాలో వార్తలు వచ్చిన తరువాత, తాను వివరాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. కోర్టుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మరింత సమాచారం వెలువడాల్సి వుంది.