స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ పాలనకు రిఫరెండం కాదు: మంత్రి అవంతి
- మీడియాతో మాట్లాడిన మంత్రి అవంతి
- వైసీపీ అన్ని చోట్లా గెలుస్తుందని ధీమా
- రాజధానుల అంశం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపదని వెల్లడి
రాజధానుల అంశం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని తాము భావించడంలేదని పేర్కొన్నారు. రాజధాని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాజధాని రైతులకు మేలు చేసే నిర్ణయాలనే సీఎం తీసుకుంటారని అవంతి వివరించారు. రాజధానిలో తాజా పరిణామాలపై స్పందిస్తూ, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.