అంబులెన్స్ వస్తోంది.. దానికి దారి ఇవ్వకండి: బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్
- సీఏఏకు మద్దతుగా బీజేపీ ర్యాలీ
- అదే సమయంలో వచ్చిన అంబులెన్సు
- ఆ అంబులెన్సును టీఎంసీ పంపిందని దిలీప్ ఘోష్ వ్యాఖ్య
ర్యాలీ నేపథ్యంలో రహదారిపై బీజేపీ కార్యకర్తలు వందల సంఖ్యలో ఉండగా ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో ఆ అంబులెన్స్‌కు దారి ఇవ్వొద్దని దిలీప్ ఘోష్ కార్యకర్తలకు సూచించి, దాన్ని వెనక్కి తిప్పి పంపండని ఆదేశించారు. తమ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకే తృణమూల్ కాంగ్రెస్ ఆ అంబులెన్స్‌ను పంపిందని అన్నారు. ఇందుకు సంబంధించి వీడియో మీడియాకు చిక్కింది.