Ambati Rambabu: దౌర్జన్యంగా రైతులు ఏమీ సాధించలేరు: అంబటి

  • పిన్నెల్లిపై హత్యా ప్రయత్నం జరిగింది
  • రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు
  • చంద్రబాబు వర్గం మాత్రమే ఆందోళనల్లో పాల్గొంటోంది
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు తన భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై జరిగింది కేవలం దాడి మాత్రమే కాదని... చంద్రబాబు కనుసన్నల్లో జరిగిన హత్యా ప్రయత్నమని ఆరోపించారు. తమ అధినేత జగన్ ను అక్రమంగా జైల్లో పెట్టినా, ఎయిర్ పోర్టులో దాడి చేసినా తాము సంయమనం కోల్పోలేదని... శాంతియుతంగానే నిరసనలు తెలిపామని చెప్పారు. అమరావతి రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇదే సమయంలో రైతులను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. దౌర్జన్యంగా రైతులు ఏమీ సాధించలేరని అన్నారు. చంద్రబాబు వర్గం మాత్రమే రైతుల ఆందోళనల్లో పాల్గొంటోందని చెప్పారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam
Jagan
Amaravati Farmers

More Telugu News