Andhra Pradesh: రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • ప్రభుత్వం నివేదిక ఇస్తే స్పందిస్తామని వెల్లడి 
  • అప్పటివరకు ఈ విషయంలో బీజేపీ జోక్యం చేసుకోదు 
  • పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల మధ్య తేడా ఉంటుందన్న కిషన్ రెడ్డి
ఏపీ రాజధాని అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తే అప్పుడు కేంద్రం తరఫున స్పందిస్తామని, అప్పటివరకు ఏపీ రాజధాని విషయంలో బీజేపీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. పార్టీ తరఫున వ్యక్తమయ్యే అభిప్రాయాలకు, ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని వెల్లడించారు.
Andhra Pradesh
Amaravati
YSRCP
AP Capital
Kishan Reddy
BJP

More Telugu News