Amaravati: రాజధాని రైతుకు గుండెపోటు.. మనవళ్లను అరెస్టు చేశారన్న దిగులుతో మృతి

  • వెలగపూడికి చెందిన రైతు గోపాలరావుకు గుండెపోటు
  • కొన్ని గంటల క్రితమే బాబు కాన్వాయ్ కు స్వాగతం పలికిన వైనం
  • మనవళ్లను అరెస్టు చేయడంతో దిగులు  
అమరావతి ప్రాంతానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వెలగపూడికి చెందిన రైతు గోపాలరావు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలిచేందుకు ఈరోజు సాయంత్రం అక్కడికి చంద్రబాబు వెళ్లారు. బాబు కాన్వాయ్ కు చేతులు ఊపుతూ ఆయన స్వాగతం పలికారు. అయితే, గోపాలరావు ఇద్దరు మనవళ్లను పోలీసులు ఇవాళ అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనతో దిగులు పడ్డ గోపాలరావు గుండెపోటుకు గురైనట్టు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Amaravati
Farmer
Gopalarao
heart-attack

More Telugu News