New Delhi: ఢిల్లీలో అమిత్ షాను కలిసిన మోహన్ బాబు

  • ఈ ఉదయం మోదీతో సమావేశమైన మోహన్ బాబు
  • మోహన్ బాబు వెంట కుటుంబసభ్యులు
  • మోహన్ బాబు బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం
సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు బీజేపీ వైపు అడుగులేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం మోహన్ బాబు తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. మోహన్ బాబు వెంట మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, విరోనికా కూడా ఉన్నారు. గతకొంతకాలంగా మోహన్ బాబు వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వరుసగా బీజేపీ అగ్రనేతలతో సమావేశమవుతుండడంతో మోహన్ బాబు రాజకీయ పయనంపై ఆసక్తి నెలకొంది.
New Delhi
Mohanbabu
Amit Shah
BJP
YSRCP

More Telugu News