ఓ బాలిక కడగండ్లు విని కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సినీ హీరో సూర్య

  • సామాజిక సేవ చేస్తున్న తమిళ హీరో
  • అగరం ఫౌండేషన్ తో ఆపన్నులకు చేయూత
  • గాయత్రి అనే బాలికకు తోడ్పాటు అందించిన సూర్య
తమిళ హీరో సూర్య సామాజిక సేవలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన అగరం ఫౌండేషన్ తమిళనాడు వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆపన్నులకు చేయూత అందించడంలో అగరం ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకు కారణం సూర్య సేవా తత్పరతే. తాజాగా, తన ఫౌండేషన్ ద్వారా సాయం అందుకున్న గాయత్రి అనే బాలిక జీవితగాథను ఆమె మాటల్లోనే విన్న సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. తన ఫౌండేషన్ కార్యకలాపాలపై ముద్రించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి గాయత్రిని కూడా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో గాయత్రి మాట్లాడుతూ, ఓ చిన్న పల్లెటూర్లో పుట్టిన తాను ప్రస్తుతం ఇంగ్లీష్ శిక్షకురాలిగా పనిచేస్తున్నానని, రోజు కూలీ కడుపున పుట్టిన తాను ఎన్నో కష్టాలు పడి కాలేజ్ విద్య పూర్తి చేయగలిగానని గాయత్రి వెల్లడించింది. అందుకు కారణం అగరం ఫౌండేషన్ అని, ఎక్కడో అనామకురాలిగా ఉన్న తాను ఎన్నో అడ్డంకులను అధిగమించానని, ఈ ప్రస్థానంలో అగరం ఫౌండేషన్ తోడ్పాటు మరువలేనని తెలిపింది. ఆమె దయనీయ గాథను విన్న సూర్య తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కన్నీళ్లు పెడుతూ, లేచి వెళ్లి గాయత్రిని వాత్సల్యంతో దగ్గరికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Go Back to Shorts
Surya
Tamilnadu
Chennai
Agaram
Gayatri

More Telugu News