Allu Arjun: సంపదకు .. ఐశ్వర్యానికి తేడా చెప్పిన త్రివిక్రమ్

  • త్రివిక్రమ్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  •  కథా నేపథ్యం చెప్పిన త్రివిక్రమ్ 
  •  ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అల వైకుంఠపురములో' సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతూ వస్తోంది. ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ ఏం చెప్పనున్నాడా అనే కుతూహలాన్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో సంపదకు - ఐశ్వర్యానికి గల తేడాను చెప్పడానికి సరదాగా తాను ఓ ప్రయత్నం చేసినట్టుగా ఆయన చెప్పాడు. శ్రీమంతుల ఇళ్లు విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ ఎక్కువ సేపు ఉండలేమనీ, అక్కడ సంపద మాత్రమే ఉండటం వలన అలా అనిపిస్తుందని చెప్పాడు. మధ్యతరగతి ఇళ్లలో టీ తాగి వెళదామనుకుంటే భోజనం పెట్టి మరీ పంపిస్తారనీ, అందుకు కారణం అక్కడ ఐశ్వర్యం వుంటుందని అన్నాడు. త్రివిక్రమ్ మాటలను బట్టి, అసలైన ఐశ్వర్యం ఆత్మీయతే అనే విషయాన్ని అయన తెరపై ఆవిష్కరిస్తున్నట్టుగా అర్థమవుతోంది.
Allu Arjun
Pooja hegde

More Telugu News