elections: వి'చిత్రం'.. ఎన్నికల్లో తనను ఓడించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లు
- తమిళనాడులో ఘటన
- కేత్తువార్‌పట్టి పంచాయతీలో పోటీ చేసి ఓడిన మురుగేశన్
- ప్రజలు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదని వ్యాఖ్య
ఎన్నికల్లో గెలిపించినందుకు రాజకీయ నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం సహజమే. అయితే, ఎన్నికల్లో ఓడించినందుకు గానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లు అంటించిన ఘటన తమిళనాడులోని మదురై జిల్లా కేత్తువార్‌పట్టి పంచాయతీలో చోటు చేసుకుంది. ఈ పంచాయతీలోని రెండవ వార్డు సభ్యుడి పదవి కోసం మురుగేశన్, తంగపాండి, పవున్‌తాయ్ ఇటీవల పోటీ చేశారు.
మురుగేశన్ ‘మంచం’ గుర్తుపై పోటీచేసి ఓడిపోయాడు. దీంతో ఆయన విచిత్రంగా ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్‌లు అంటించి అందులో... వార్డు సభ్యుడిగా పోటీచేసిన తనను ఓడించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, వారు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదని తెలిపాడు.