Rajasekhar: హీరో రాజశేఖర్ రాజీనామాకు ఆమోదం తెలిసిన 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ

  • మాలో ముదిరిన విభేదాలు
  • బాహాటంగా విమర్శలు చేసిన రాజశేఖర్
  • క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న చిరంజీవి
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు మరింత ముదిరిన నేపథ్యంలో 'మా'లో తాను ఉండలేనంటూ హీరో రాజశేఖర్ పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడాయన రాజీనామాను 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది. రాజశేఖర్ 'మా' కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే, కొన్నిరోజుల క్రితం 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో బాహాటంగానే విమర్శలు గుప్పించాడు. చిరంజీవి, మోహన్ బాబు వంటి సీనియర్లు కూడా రాజశేఖర్ ప్రవర్తన పట్ల అభ్యంతరం చెప్పారు. అదే రోజు సాయంత్రమే రాజశేఖర్ తన రాజీనామా ప్రకటించాడు.

నేడు జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రాజశేఖర్ రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. అంతేకాకుండా కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధతో ఉన్నతస్థాయి క్రమశిక్షణ చర్యల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
Rajasekhar
MAA
Tollywood
Chiranjeevi
Mohanbabu

More Telugu News