YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చేదుఅనుభవం

  • కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ శంకుస్థాపన 
  • ఆమె వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ నాయకులు
  • టీడీపీ వారికి ప్రాధాన్యమిస్తున్నారంటూ రోజాపై ఆగ్రహం
ఏపీఐసీసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్ పురంలోకి ఆమెను రానీయకుండా సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. వైసీపీ నాయకులను వదిలిపెట్టి టీడీపీ వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ శంకుస్థాపనకు వెళ్లిన రోజాను నిలదీశారు. ఆమె వాహనాన్ని చుట్టుముట్టారు. దీంతో, అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని వారికి సర్దిచెప్పారు.
YSRCP
mla
Roja
Chittoor District
kbr puram

More Telugu News