Andhra Pradesh: ఏపీకి రెండు రాజధానుల ఆలోచన సరైంది: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • హైకోర్టు ఉన్న ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది?
  • అమరావతి రైతులకు న్యాయం చేయాలి
  • అమరావతి రైతులు బాధపడుతుంటే మేము ఆనందంగా ఎలా ఉంటాం?
ఏపీకి మూడు కాదు రెండు రాజధానుల ఆలోచన సరైందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు ఉన్న ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు బాధపడుతుంటే తాము ఎలా ఆనందంగా ఉండగలమని ప్రశ్నించిన ఆయన, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు అనుసరిస్తున్న పద్ధతి సరిగా లేదని, అణిచివేత ధోరణి కరెక్టు కాదని హితవు పలికారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టింగ్ కమిటీలు విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సిఫారసు చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్ని అన్నారు. విశాఖకు ఉన్న అర్హత, ప్రత్యేకతల వల్లే అన్ని కమిటీలు సానుకూల నివేదికలు ఇచ్చాయని అన్నారు.
Andhra Pradesh
Amaravati
BJP
Vishnu Kumar Raju

More Telugu News