Pawan Kalyan: పవన్ ముళ్లకంచెలు దాటుకుని వెళుతుంటే చిరంజీవి విశాఖలో స్టూడియో కోసం జగన్ కు మద్దతిస్తున్నారు: శోభారాణి

  • రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించిన శోభారాణి
  • జగన్ ఓ ఉన్మాది అంటూ ఆగ్రహం
  • రోజా, పృథ్వీ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక
తెలుగుదేశం మహిళా నేత శోభారాణి తుళ్లూరులో ఆందోళనలు నిర్వహిస్తున్న రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్ ఓ ఉన్మాది అని, ప్రజాప్రయోజనాలు అతనికి పట్టవు అని ఆరోపించారు. ఒక్క చాన్స్ అని ఊరూరా తిరిగి ప్రజల్ని అడుక్కున్నాడని, నేడు అమరావతి ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టాడని విమర్శించారు. అంతేగాకుండా, వైసీపీ నేతలు రోజా, పృథ్వీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారిద్దరూ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సిగ్గులేకుండా మాట్లాడితే జనాలు చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. పవన్ రైతుల కోసం ముళ్లకంచెలు దాటుకుని వెళుతుంటే, విశాఖలో స్టూడియోల కోసం చిరంజీవి సీఎం జగన్ కు మద్దతిస్తున్నాడని ఆరోపించారు.
Pawan Kalyan
Chiranjeevi
Shobharani
Telugudesam
Andhra Pradesh
Amaravati

More Telugu News