'ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఏపీ ప్రజలకు కష్టాలు' అన్న నాగబాబు.. కామెంట్ 'అదిరింది' అంటోన్న నెటిజన్లు
- ఇద్దరు నేతలను ఉద్దేశించి నాగబాబు ట్వీట్
- నాగబాబు వ్యాఖ్యకు ఫన్నీగా కామెంట్లు చేస్తోన్న నెటిజన్లు
- 'మీరేం బాధపడకండి .. మీరు తెలంగాణలో ఉంటున్నారు' అంటూ రిప్లై
అయితే, వైసీపీ అభిమాని ఒకరు స్పందిస్తూ... 'వారిలో ఒకరు చంద్రబాబు మరొకరు పవన్ కల్యాణ్.. అంతేగా? నాగబాబు గారూ' అంటూ సెటైర్ వేస్తూ రిప్లై ఇచ్చాడు. 'ఇద్దరు మనుషులే కాదు.. రెండు మాఫియాలు ఉన్నాయి.. వారికి అనైతిక మీడియా మద్దతు తెలుపుతోంది' అని ఒకరు కామెంట్ చేశారు.
నాగబాబు కామెంట్ 'అదిరింది' అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆయన 'అదిరింది' అనే కామెడీ షోలో పాల్గొంటోన్న విషయం తెలిసిందే.
'మీరేం బాధపడకండి సర్.. ఎందుకంటే మీరు తెలంగాణలో ఉంటున్నారు.. మీరు అప్పుడప్పుడు ఏపీలో పర్యటిస్తున్నారంతే!' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.