Gutta Jwala: గుత్తా జ్వాల ప్రియుడు విష్ణు విశాల్ తో రొమాన్స్ చేయనున్న నటి ప్రియా భవానీ!
- నెట్టింట వైరల్ అయిన గుత్తా జ్వాల చిత్రాలు
- విష్ణు విశాల్ చిత్రంలో నటించేందుకు ప్రియా భవానీ సిద్ధం
- ఇప్పటికే కోలీవుడ్ లో బిజీగా ఉన్న ప్రియా భవానీ
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రస్తుతం డేటింగ్ లో ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన ప్రియుడితో కలిసి గుత్తా జ్వాల దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. వీరిద్దరి లవ్ ఎఫైర్ పై వార్తలు ఓ వైపు చక్కర్లు కొడుతూ ఉండగా, మరోవైపు తన కొత్త చిత్రాలతో విష్ణు విశాల్ బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం 'జగజ్జాల కిలాడీ', 'ఎఫ్ఐఆర్' చిత్రాల్లో నటిస్తున్న ఆయన, తాజాగా మరో కొత్త సినిమాలో ప్రియా భవానీ శంకర్ తో రోమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కథను విన్న ప్రియా భవానీ, నటించేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నో చిత్రాలను చేతిలో ఉంచుకున్న ఈ అమ్మడు, ఇంకా డేట్స్ మాత్రం కేటాయించలేదని సమాచారం. 'ఇండియన్-2'తో పాటు 'కురుది ఆట్టం', 'కళత్తిల్ సంథిస్పోమ్', 'కసడదపర', 'మాఫియా', 'బొమ్మై' తదితర సినిమాల్లో ప్రియా భవానీ నటిస్తోంది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం స్టోరీ నచ్చిందని, ఖాళీ చూసుకుని డేట్స్ ఇస్తానని అంటోంది.