అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేలా బీసీజీ నివేదిక ఉంది: మోపిదేవి
- గతంలో పొరపాట్లను సరిదిద్దుకునే సమయం ఇది
- ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే మూడు రాజధానులు
- పారదర్శక నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయం చేయవద్దు
పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాజధాని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. హైపవర్ కమిటీ ఈ నెల 6న సమావేశమవుతుందని, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇస్తామని చెప్పారు. మహిళలకు ఇబ్బంది కలిగించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, రైతులు నిన్న కొందరు పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అందుకే, వాళ్లు అలా వ్యవహరించి ఉండొచ్చని అన్నారు.