మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కు మాత్రమే కాదు.. నాలుగు బీజేపీ రాష్ట్రాలకు కూడా దక్కని అవకాశం!
- రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఢిల్లీ
- పరేడ్ కోసం 56 శకటాల ప్రపోజల్స్
- 28 శకటాలకు ఆమోదముద్ర
రిపబ్లిక్ డే పరేడ్ లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ డిపార్టుమెంటులకు చెందిన శకటాలు పాలుపంచుకుంటుంటాయి. ఈ శకటాలను ఒక ఎక్స్ పర్ట్ కమిటీ వరుస సమావేశాల అనంతరం ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కోసం 56 ప్రపోజల్స్ వచ్చాయి. వీటిలో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 22 ప్రపోజల్స్, వివిధ శాఖల నుంచి వచ్చిన 6 ప్రపోజల్స్ ను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో బీజేపీ అధికారంలో లేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ శకటాలకు కూడా ఆమోదముద్ర పడింది.