Nara Lokesh: రోడ్డెక్కి కన్నీరు పెడుతున్న రైతులను వైసీపీ నేతలు అత్యంత ఘోరంగా అవమానించారు: నారా లోకేశ్

  • అమరావతిలో రైతుల నిరసనలు
  • మద్దతుగా స్పందించిన లోకేశ్
  • ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలని పిలుపు
ఏపీ రాజధాని రైతులకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి స్పందించారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అమరావతి రైతులు వీధుల్లోకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసనలు చేపడుతున్నారు. దీనిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నారా లోకేశ్ తప్పుబట్టారు.

 తమ భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ రాజధాని రైతులు రోడ్డెక్కి కన్నీరు పెడుతుంటే, పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నాయకులు వారిని అత్యంత ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. తమ భవిష్యత్ కోసం ఉద్యమిస్తున్న రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఇదని తెలిపారు. రైతులకు మద్దతు ఇస్తున్న మేధావులకు ఉద్యమ వందనాలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, రాజధాని రైతులు పెయిడ్ ఆర్టిస్టులవుతారా? అంటూ ప్రశ్నించిన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వీడియోను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పొందుపరిచారు.

Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Amaravati
YSRCP
Farmers

More Telugu News