Bollywood: బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లే అంటున్న కేరళ మహిళ

  • అనురాధ పౌడ్వాల్ కు విచిత్ర పరిస్థితి
  • అనురాధ తన తల్లేనంటూ కోర్టును ఆశ్రయించిన కర్మ మోదెక్స్
  • తమ ఎదుట హాజరు కావాలంటూ అనురాధకు కోర్టు ఆదేశాలు
ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ కి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కేరళకు చెందిన ఓ మహిళ అనురాధ పౌడ్వాల్ తన తల్లి అని చెబుతోంది. కేరళకు చెందిన ముగ్గురు పిల్లల తల్లి కర్మ మోదెక్స్ (45) తన తల్లి అనురాధ పౌడ్వాల్ అని, నాలుగు రోజుల పసికందుగా ఉన్నప్పుడే తనను వదిలేసిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనను పెంచిన పొన్నచ్చన్ చనిపోయే ముందు ఈ రహస్యాన్ని చెప్పాడంటూ కర్మ వెల్లడించింది. కెరీర్ కు అడ్డొస్తాననే తనను వదిలించుకుందని ఆరోపించింది.

తనను పెంచిన తల్లికి ఈ విషయం తెలియదని, ఆమెకు మతిమరపు వ్యాధి ఉందని తెలిపింది. అంతేకాదు, తనకు అనురాధ నుంచి రూ.50 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరింది. వారు అంగీకరించకపోతే డీఎన్ఏ టెస్టుకైనా తాను సిద్ధమేని కర్మ పేర్కొంది. కర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 27న హాజరు కావాల్సిందిగా అనురాధ పౌడ్వాల్ ను ఆదేశించింది.
Bollywood
Singer
Anuradha Paudwal
Kerala
Karma Modex
Court

More Telugu News