MAA: హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం... 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా!

  • 'మా' డైరీ ఆవిష్కరణలో రభస
  • రాజశేఖర్ విమర్శలు
  • భగ్గుమన్న చిరంజీవి, మోహన్ బాబు
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. మా అధ్యక్షుడు నరేశ్ వైఖరి మనస్తాపం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు.

అంతకుముందు హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ తీవ్ర ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబులు సైతం ఆగ్రహానికి గురయ్యేలా రాజశేఖర్ ప్రసంగం సాగింది. ఈ వివాద ఫలితంగానే రాజశేఖర్ 'మా' పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేసిన కాసేపటికే రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.
MAA
Rajasekhar
Tollywood
Hyderabad
Chiranjeevi
Mohanbabu

More Telugu News