Janasena: ‘ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాకపోతే.. రైతులకు గ్యారంటీ ఏంటీ?’: నాటి వీడియోను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్

  • పెనుమాకలో 2015, ఆగస్టు 23న పవన్ ప్రసంగ వీడియో 
  • భూ సమీకరణ ఎంత పకడ్బందీగా ఉండాలి?
  •  భూములు ఇచ్చిన రైతులకు ధ్రువీకరణ పత్రాలు లేకపోతే ఎంత హాని?
టీడీపీ హయాంలో పెనుమాకలో జరిగిన ఓ సభలో తాను చేసిన ప్రసంగాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. 2015, ఆగస్టు 23న పెనుమాకలో తన ప్రసంగ వీడియోను పోస్ట్ చేశారు. ‘భూ సమీకరణ ఎంత పకడ్బందీగా ఉండాలంటే.. అనేక వేల మంది రైతులు తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వాళ్ల, వాళ్ల పిల్లల, తరాల భవిష్యత్ ను తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పెడుతున్నారు.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే.. అలాంటి పరిస్థితుల్లో రైతులకు గ్యారంటీ ఏంటీ?’ అంటూ పవన్ తన ప్రసంగంలో ప్రశ్నించడం ఈ వీడియోలో ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు కనుక లేకపోతే ఎంత హాని కలుగుతుంది? దానిపై టీడీపీ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది? అంటూ పవన్ ప్రసంగించడం గమనార్హం.  
Janasena
Pawan Kalyan
Telugudesam
Chandrababu

More Telugu News