Chandrababu: అదే జరిగితే.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా గోవిందా: మంత్రి ధర్మాన కృష్ణదాస్

  • టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు జంప్
  • మరో ఇద్దరు వెళ్లిపోతే ప్రతిపక్ష నాయకుడి హోదా గల్లంతు
  • వైసీపీ అంటే ప్రజలకు అపార గౌరవం
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ప్రతిపక్ష హోదాపై ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది మాత్రమే గెలిచారని గుర్తు చేశారు. వారిలోంచి ఇద్దరు ఇప్పటికే బయటకు వచ్చేశారని, మరో ఇద్దరు కనుక వెళ్లిపోతే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదన్నారు. వైసీపీ అంటే ప్రజలకు అపారమైన గౌరవం ఉందని, ఆ గౌరవంతోనే ఎన్నికల్లో తమ పార్టీకి ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారని మంత్రి తెలిపారు.
Chandrababu
Dharmana krishna prasad
YSRCP
Telugudesam

More Telugu News