Vijay Devarakonda: మరో కొత్త బిజినెస్ ను ప్రారంభించనున్న విజయ్ దేవరకొండ

  • మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ
  • ఏషియన్ సినిమాస్ తో కలిసి బిజినెస్
  • ఇప్పటికే ఈ బిజినెస్ లో ఉన్న మహేశ్ బాబు
అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'రౌడీ' పేరుతో దుస్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.

తాజాగా ఇప్పుడు మరో బిజినెస్ ప్రారంభించబోతున్నాడు. మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఈ వ్యాపారాన్ని నిర్వహించబోతున్నాడు. ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్ లో తొలి మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నాడు. మహేశ్ బాబు కూడా ఇప్పటికే ఈ బిజినెస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
Vijay Devarakonda
Tollywood
Business

More Telugu News