Andhra Pradesh: జగన్ వేసే ఐదు రూపాయల ముష్టి కోసం ఎంతకైనా దిగజారతారు: లోకేశ్ ఆగ్రహం

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ పేటీఎం బ్యాచ్ తన పేరుతో నకిలీ పోస్టులు వ్యాప్తి చేస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో సరైన బిర్యానీ సెంటర్ లేదని, మంచి కర్రీ పాయింట్ ఒక్కటి కూడా లేదని, విజయవాడ వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని తాను ట్వీట్ చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. అది ఫేక్ ట్వీట్ అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ వేసే ఐదు రూపాయల ముష్టి కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ సభ్యులు ఎంతకైనా దిగజారతారని ట్వీట్ చేశారు. వారి అధ్యక్షుడిదే ఫేక్ బతుకు అయినప్పుడు, పాపం వీరి జీవితాల్లో మార్పు ఎలా వస్తుంది! అంటూ స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
Nara Lokesh
Telugudesam
PAYTM

More Telugu News