Devineni Uma: గొల్లపూడిలో 24 గంటల నిరసన దీక్ష చేపట్టిన దేవినేని ఉమ

  • రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్
  • రేపటి నుంచి పుణ్యస్థలంలో రిలే నిరాహార దీక్షలు
  • ప్రభుత్వం ప్రకటన చేసేవరకు ఉద్యమం ఆగదన్న ఉమ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గొల్లపూడిలో 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. తాను దీక్ష ప్రారంభించిన విషయాన్ని ఉమ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి పుణ్యస్థలంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రజా రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని ఉమ స్పష్టం చేశారు.
Devineni Uma
Telugudesam
Andhra Pradesh
Amaravathi
Praja Rajadhani
Gollapudi
Punyasthalam

More Telugu News