Krishna District: కృష్ణా జిల్లాలో మేడ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
- పదో తరగతి చదువుతున్న మృతుడు
- కృష్ణా జిల్లా తిరువూరులో ఘటన
- బాధితునిది గొల్లపూడి గ్రామం
కృష్ణా జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన మణికంఠ తిరువూరులోని పాఠశాలలో చదువుతున్నాడు. ఉన్నట్టుండి ఈ రోజు ఉదయం మేడ పై నుంచి దూకేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన అతన్ని విద్యార్థులు, సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది తెలియరాలేదు.