Kesineni Nani: భూమిని త్యాగం చేసిన రైతులకు మీరిచ్చే బహుమతి ఇదేనా జగన్ అన్నా?: కేశినేని నాని

  • రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగాలు చేశారు
  • తమ ప్రాణంతో సమానంగా చూసుకునే భూములిచ్చారు
  • హత్యా యత్నం కేసులు పెట్టి జైల్లో పెడతారా?
మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపర్చిన కేసులో నిన్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. అరెస్టుల కలకలంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'రాజధాని నిర్మాణం కోసం తమ ప్రాణంతో సమానంగా చూసుకునే, తమకు తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసిన రైతులకు మీరిచ్చే బహుమతి హత్యా యత్నం కేసులు పెట్టి జైలులో పెట్టటమా జగన్ అన్నా?' అని ప్రశ్నిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. అరెస్టులకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. 
Kesineni Nani
Andhra Pradesh
Telugudesam

More Telugu News