APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ నూతన ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

  • ప్రస్తుతం ఏపీఐఐసీ వైస్ చైర్మన్ 
  • 1991 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి 
  • ప్రతాప్ స్థానంలో రజిత్ భార్గవ్ నియామకం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్‌కు నూతన ఎండీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ను నియమించింది. ప్రభుత్వం ఇటీవలే ఆర్టీసీనీ ప్రభుత్వ రంగంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఎండీ స్థానంలో ప్రతాప్ ను ప్రభుత్వం కూర్చోబెట్టింది. ఈయన స్థానంలో ప్రస్తుతం పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రజత్ భార్గవ్ ను ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమించింది.

APSRTC
MD
Madireddy Pratap

More Telugu News