'రంగమార్తాండ' స్పీడు మీదే వున్నాడు
- మరాఠీ రీమేక్ గా 'రంగమార్తాండ'
- చకచకా జరుగుతున్న షూటింగ్
- వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కృష్ణవంశీ వున్నాడు. ఆ దిశగానే చకచకా షూటింగును కానిచ్చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.