Rajahmahendravaram: రాజమహేంద్రవరంలో ట్రిపుల్ తలాక్... పోలీసులను ఆశ్రయించిన మహిళ!

  • విడాకుల కేసు నడుస్తుండగా తలాక్
  • ట్రిపుల్ తలాక్ క్రిమినల్ నేరమే
  • చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ మహిళ, తన భర్త ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడంటూ పోలీసులను ఆశ్రయించింది. వన్ టౌన్ పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఇక్కడి రాజేంద్ర నగర్ లో అజీ అక్బాల్, మహ్మద్ వహీదా బేగం భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తుండగా, విడాకుల కేసు కోర్టులో వుంది. ఈ క్రమంలో వహీదా వద్దకు వచ్చిన ఇక్బాల్, ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారిస్తున్నామని తెలిపారు. కాగా, ట్రిపుల్‌ తలాక్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే.
Rajahmahendravaram
Triple Talak
Police
Case

More Telugu News