Rajinikanth: హైదరాబాద్‌లో రజనీకాంత్‌ను కలిసిన ఖుష్బూ చిన్న కుమార్తె

  • శివ దర్శకత్వంలో రూపొందుతున్న రజనీ సినిమా
  • రజనీని కలిసి ఆశీస్సులు తీసుకున్న ఆనందిత
  • చిరకాల కోరిక తీరిందంటూ ట్వీట్
హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సీనియర్ నటి ఖుష్బూ చిన్న కుమార్తె ఆనందిత కలిసి ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్బంగా రజనీకాంత్‌తో తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి రజనీకి కృతజ్ఞతలు తెలిపింది.

శివ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రజనీని కలిసిన ఆనందిత ఆయన నుంచి ఆశీస్సులు తీసుకుంది. రజనీని కలిసి ఫొటో తీసుకుని, ఆయన ఆశీస్సులు పొందాలన్నది తన చిరకాల కోరికని ఆనందిత పేర్కొంది. రజనీని చూసిన వెంటనే తన గుండె ఆగినంత పనైందని చెప్పుకొచ్చింది. తన కోసం అమూల్యమైన సమయాన్ని కేటాయించిన రజనీకాంత్‌కు హృదపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆనందిత పేర్కొంది.
Rajinikanth
Anandita
khushboo

More Telugu News