President Of India: దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న అమితాబ్

  • రాష్ట్రపతి భవన్ లో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం
  • రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బిగ్ బీ
  • అమితాబ్ ను అభినందించిన రామ్ నాథ్ కోవింద్
సినీ రంగానికి విశేష సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అమితాబ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ ను కోవింద్ అభినందించారు. అనంతరం, అమితాబ్ ప్రసంగిస్తూ, ఈ అవార్డు అందుకోవడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, దర్శక నిర్మాతల సహకారం, అభిమానుల ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పారు.
President Of India
Amitabh Bachchan
Dadasaheb Phalke

More Telugu News