Jr NTR: ఎన్టీఆర్ కు కథ వినిపించిన మాట వాస్తవమే: మురుగదాస్

  • రజనీకాంత్ తో దర్బార్ చిత్రాన్ని తెరకెక్కించిన మురుగదాస్
  • మీడియాకు ఇంటర్వ్యూ
  • ఇటీవల ఎన్టీఆర్ ను కలవలేదని వెల్లడి
సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ సినిమా తెరకెక్కించిన హిట్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన నెక్ట్స్ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ తోనే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఎన్టీఆర్ తో సినిమా వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చాలాకాలం కిందట ఎన్టీఆర్ కు కథ వినిపించింది నిజమేనని, కానీ అది ఫైనలైజ్ కాలేదని వివరించారు. కొంతకాలంగా ఎన్టీఆర్ ను తాను కలవలేదని వెల్లడించారు. గతంలో మహేశ్ బాబుతో స్పైడర్ సినిమా గురించి చెబుతూ, తెలుగు ప్రేక్షకుల నాడి పట్టలేకపోయానని తెలిపారు. ఆ సినిమాతో మహేశ్ బాబును తమిళంలో పరిచయం చేద్దామని భావించినా, పూర్తి న్యాయం చేయలేకపోయానని పేర్కొన్నారు.
Jr NTR
Murugadas
Mahesh Babu
Spider
Rajinikanth
Darbar

More Telugu News