Harish Rao: విద్యార్థులను స్మార్ట్ ఫోన్లు, టీవీలు, వినోదాలకు దూరంగా ఉంచండి: మంత్రి హరీశ్ రావు
- ప్రతి విద్యార్థికి జీవితంలో కీలకమైనది పదో తరగతి
- పిల్లలకు ఇంటి పనులు చెప్పొద్దు
- పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రతి రోజు బడికి వెళ్లనివ్వాలి
- తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలి
ప్రతి విద్యార్థికి జీవితంలో కీలకమైనది పదో తరగతని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో పిల్లలకు ఇంటి పనులు, వ్యవసాయ పనులు చెప్పవద్దని ఆయన కోరారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రతి రోజు వారు బడికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంట్లో వారికి చదువుకునే వాతావరణం కల్పించాలని హరీశ్ రావు కోరారు. కొన్ని రోజుల పాటు వారిని స్మార్ట్ ఫోన్ లు, టీవీలు, వినోదాల వంటి వాటికి దూరంగా ఉంచండని అన్నారు. పిల్లల భవిష్యత్ కంటే తల్లిదండ్రులకు ఏదీ ముఖ్యం కాదని ఆయన చెప్పారు. పాఠశాలల్లో టీచర్లు చేస్తోన్న ప్రయత్నానికి తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. వారి భవిష్యత్తు బంగారుమయమయ్యేలా సహకరించాలని ఆయన అన్నారు.