చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు

  • రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు
  • చంద్రబాబును ఇరికించడం సాధ్యంకాదన్న రఘురామ కృష్ణంరాజు
  • చట్టాలు మార్చితే తప్ప చంద్రబాబును ఏమీచేయలేమని వ్యాఖ్యలు
ఏపీలో అటు రాజకీయ పక్షాల్లోనూ, ఇటు ప్రజానీకంలోనూ రాజధాని అంశం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడున్న చట్టాలతో చంద్రబాబును ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో ఇరికించడం సాధ్యమయ్యే పనికాదని అన్నారు. చట్టాలు మార్చితే తప్ప చంద్రబాబును ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఓ వార్తా చానల్ చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నిన్నటి మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రాజధానిలో అవినీతి, అక్రమాలపై సీఐడీ కానీ, సీబీఐతో కానీ విచారణ జరిపిస్తామని సూచన ప్రాయంగా తెలిపిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Andhra Pradesh
Amaravathi
Insider Trading
Raghurama Krishnamraju
YSRCP

More Telugu News