TRA former MP Vinod: అతి ధీమాతో ప్రచారం చేయలేదు.. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయా: టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్

  • లోక్ సభ ఎన్నికలు గుణపాఠం నేర్పాయి
  • గెలుపోటములను సమానంగా తీసుకుంటాను
  • మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
గత లోక్ సభ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానన్న ధీమాతో ప్రచారం చేయలేదని అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికలు తనకు గుణపాఠమని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో వినోద్ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అపజయం పాలైన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అతి ధీమాతో ప్రచారం చేయలేకపోవడంతో పరాజయం పాలయ్యానని చెప్పుకొచ్చారు. గెలుపోటములను తాను సమానంగా తీసుకుంటానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పుట్టినప్పుడు అసలు తాము ఎంపీలు, మంత్రులు అవుతామని అనుకోలేదన్నారు. అలాగే కేసీఆర్ కూడా సీఎం అవుతారని అనుకోలేదని చెప్పారు.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉందంటూ..అందరికీ టికెట్లు రావటం కష్టమన్నారు. కొన్ని సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులు ఉంటాయని ఆయన తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వీటిని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
TRA former MP Vinod
comments on his defeat in 2019 LS polss
Telangana

More Telugu News