Hyderabad: హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం... అతిథులను ఆప్యాయంగా పలకరించిన ప్రథమపౌరుడు

  • శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి
  • బొల్లారం నివాసంలో తేనీటి విందు
  • శనివారంతో ముగియనున్న రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి ప్రతి ఏడాది శీతాకాలంలో హైదరాబాదులో విడిది చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాదులో విడిది చేశారు. రేపటితో ఆయన పర్యటన ముగియనున్న నేపథ్యంలో, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించగా, ప్రభుత్వ, రాజకీయ ప్రముఖులకు రామ్ నాథ్ కోవింద్ ఆత్మీయ ఆతిథ్యం అందించారు. తేనీటి విందు కోసం తన నివాసానికి వచ్చిన అతిథులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Hyderabad
President Of India
At Home
KCR
Telangana
TRS

More Telugu News