పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలపై మరో దాడికి రంగం సిద్ధమైంది: రాహుల్ గాంధీ
- ఎన్పీఆర్, ఎన్నార్సీపై రాహుల్ స్పందన
- పెద్ద నోట్ల రద్దుతో పేదలు తీవ్రంగా నష్టపోయారన్న రాహుల్
- ఇప్పుడు కూడా వాళ్లే నష్టపోతారని వ్యాఖ్యలు
ఇప్పుడు ఎన్పీఆర్, ఎన్నార్సీ కూడా అలాంటివేనని అన్నారు. పేద ప్రజలు తమ గుర్తింపు పత్రాలతో అధికారుల వద్దకు వెళితే వారు లంచం అడగడం ఖాయమని రాహుల్ పేర్కొన్నారు. లంచం ఇవ్వకపోతే ఆ పత్రాలను, వాటిలో పేర్లను అధికారులు తారుమారు చేస్తారని వివరించారు. దాంతో మరోసారి పేద ప్రజల జేబులు ఖాళీ అవడం తథ్యమని, ఈసారి కూడా ఆ డబ్బంతా 15 మంది వద్దకే చేరతాయని ఆరోపించారు. ఈ విధంగా ప్రజలపై మరోసారి దాడి జరగనుందని వెల్లడించారు.